Posts

Showing posts with the label Adilabad

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగం పెంపు – హిమాయత్‌నగర్‌లో సమీక్ష సమావేశం

Image
  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మరియు పనుల పురోగతిపై హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ముఖ్యమైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు పాల్గొని, జిల్లాలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించారు. సమీక్షలో రాష్ట్ర మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, శ్రీ వివేక్ వెంకట స్వామి గారు, ఎంపీలు శ్రీ నగేష్ గారు, శ్రీ గడ్డం వంశీ గారు, ఎమ్మెల్సీలు శ్రీ దండే విఠల్ గారు, శ్రీ అంజిరెడ్డి గారు, ఎమ్మెల్యేలు శ్రీ గడ్డం వినోద్ గారు, శ్రీ వెడ్మ బొజ్జు గారు, శ్రీ పాయల శంకర్ గారు, శ్రీ రామారావు పటేల్ గారు, శ్రీ పాల్వాయి హరీశ్ బాబు గారు పాల్గొన్నారు. అలాగే రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ లోకేష్ కుమార్ గారు, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వీపీ గౌతమ్ గారు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారు, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్...