Posts

Showing posts with the label KTR on May Day

కార్మికులకు అండగా కొండంత మద్దతు – కెటీఆర్ పిలుపుతో బీమా పంపిణీ

Image
కార్మికులకు అండగా కొండంత మద్దతు – కెటీఆర్ పిలుపుతో బీమా పంపిణీ మేడే సందర్భంగా అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం మాజీ మంత్రి శ్రీ కెటీఆర్ గారి పిలుపుతో గొప్ప కార్యక్రమం ప్రారంభమైంది. బీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు హమాలీ శ్రీనివాస్ గారు స్వంత నిధులతో డ్రైవర్లకు ₹5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించడం విశేషం. గత ప్రభుత్వ కాలంలో అమల్లో ఉన్న ప్రమాద బీమా ప్రస్తుతం నిలిచిపోవడంతో, కెటీఆర్ గారు సిరిసిల్లలో డ్రైవర్లకు స్వంతంగా ₹5 లక్షల బీమా అందించారు. అదే స్ఫూర్తితో ప్రతి నియోజకవర్గంలో కార్మికులకు అండగా నిలవాలని ఇచ్చిన పిలుపును హమాలీ శ్రీనివాస్ గారు కార్యరూపం దాల్చుతున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ శక్తినగర్ డివిజన్ పరిధిలో క్యాబ్, ఆటో, ట్రాలీ, డీసీఎం డ్రైవర్లకు స్వంత ఖర్చుతో బీమా కల్పిస్తున్నారు. మొదటి విడతగా కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా 150 మందికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మణ్ రెడ్డి గారు బీమా పత్రాలు అందజేశారు. రెండో విడతలో మరో 183 మందికి బీమా అమలు చేయగా, అందులో 5 మంది లబ్ధిదారులకు ఈరోజు తెలంగాణ భవన్‌లో కెటీఆర్ గారు స...