కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు #KTR
“తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 20 సంవత్సరాల పాటు అధికారంలోకి రావడం కల్ల” – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, కుంభకోణాలు, మోసాలు చూసి ప్రజలు ఇక మీదట కాంగ్రెస్‌కు మరోసారి ఓటు వేసే అవకాశం లేదని కేటీఆర్ చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ నేతలతో జరిగిన సుదీర్ఘ సమావేశంలో కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి పేద, మ ధ్యతరగతి ప్రజలను మోసం చేసిందని, భూ, మైనింగ్ కుంభకోణాల్లోనూ కాంగ్రెస్ మంత్రులు పాల్గొంటున్నారని ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. ఇంకోవైపు, బీజేపీ‑కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు . పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు ఓకేసారి సుమారు వెయ్యి రూపాయలు పెంచిన నిర్ణయం ఉదాహరణగా పేర్కొన్నారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ, ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ పార్టీ నాయకులకు సూచించారు. కేంద్రం పెంచిన సిలిండర్ ధరను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ బలోపేతం పైన ఆయన స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు: త్వరలో జరగనున్న పార్టీ సభ్యత్వ నమ...